News April 5, 2025
సిరిసిల్ల: జగ్జీవన్ రామ్ జీవితం తరతరాలకు స్ఫూర్తి: రామదాసు

బాబు జగ్జీవన్ రామ్ జీవితం తరతరాలకు స్ఫూర్తి అని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జె.రామదాసు అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి సర్దాపూర్‌లోని పోలీస్ బెటాలియన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. దేశంలో హరిత విప్లవం, వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. ఆర్ఐలు ఉన్నారు.
Similar News
News April 23, 2025
గార్ల మండలానికి చెందిన నిహారికకు రాష్ట్రస్థాయి ర్యాంక్

గార్ల మండలానికి చెందిన శీలం శెట్టి నిహారిక మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో 1000కి 988(బైపీసీ) మార్కులు సాధించిందని ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న నిహారిక.. చదువులో రాణించడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
News April 23, 2025
అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

అదానీ డేటా నెట్‌వర్క్స్ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.
News April 23, 2025
HYD: తెలంగాణ పోలీస్ క్రీడాకారులకు 18 పతకాలు

కొచ్చిలో జరిగిన తొలి అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్ టోర్నీలో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చూపారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీపడి12 మంది అధికారులు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నారు. వాటిలో 2 బంగారు, 2 వెండి, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరిని డీజీపీ జితేందర్ అభినందించారు. ఈ విజయం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.