News January 26, 2025

సిరిసిల్ల: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

INDvsSA.. ఇద్దరు ప్లేయర్లు దూరం!

image

భారత్‌తో మూడో వన్డేకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. జోర్జి T20 సిరీస్‌కూ దూరమైనట్లు SA బోర్డు వెల్లడించింది. టీ20లకు ఎంపికైన పేసర్ మఫాకా ఇంకా కోలుకోలేదని, అతడి స్థానంలో సిపమ్లాను ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా తొలి వన్డేలో 39 రన్స్ చేసిన జోర్జి, రెండో వన్డేలో 17పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. బర్గర్ 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీశారు.

News December 6, 2025

ధనికులకు దండాలు.. పేదలకు దండనా?.. రైల్వే తీరుపై విమర్శలు

image

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక <<18483830>>రైళ్లను<<>>, 37 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుల రద్దీతో జనరల్ బోగీలు నిండిపోయి ఇబ్బంది పడుతున్నా మా కోసం ఎప్పుడైనా అదనపు బోగీలు వేశారా? ధనవంతులకి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయమా?’ అని మండిపడుతున్నారు. పండుగల సమయాల్లోనైనా బోగీలు పెంచాలంటున్నారు.

News December 6, 2025

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: వీసీ

image

కాళోజి నారాయణరావు వర్సిటీ పరిధి కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నూతన వీసీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. వర్సిటీ వీసీగా శనివారం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే కళాశాల నుంచి అడ్మిషన్ సైతం తొలగిస్తామన్నారు. వైద్య విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కావద్దని సూచించారు.