News January 23, 2025

సిరిసిల్ల: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: డీఈఈ

image

సిరిసిల్ల పట్టణంలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈనెల 25వ తేదీన జరిగే జాబ్ మేళాను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఉపాధి అధికారి రాఘవేందర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News November 17, 2025

HYD: ప్రమాదంపై చర్యలు వేగవంతం: సీఎస్

image

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై చర్యలు వేగవంతం చేసేందుకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం అందించేందుకు, సహాయం కల్పించేందుకు 24×7 హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుందన్నారు.

News November 17, 2025

పెళ్లిపై రూమర్స్.. అసహ్యమేస్తోందన్న త్రిష

image

తనకు పెళ్లంటూ వస్తున్న రూమర్స్ అసహ్యం కలిగిస్తున్నాయని హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మ్యారేజ్, పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ‘నేనెవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి అయినట్లేనా? నాకు ఎంత మందితో వివాహం చేస్తారు? ఇలాంటి ప్రచారం ఆపండి’ అని పేర్కొన్నారు. త్రిష ఓ హీరోతో డేట్‌లో ఉందని, చండీగఢ్ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

News November 17, 2025

కిచెన్ టిప్స్

image

* కొత్తిమీర వాడిపోతే వేర్లు కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో కాడలు మునిగేలా ఉంచాలి. అరగంట తర్వాత కొత్తిమీర తాజాగా మారుతుంది.
* ఎంత నీరు తాగినా దాహం తీరకపోతే ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని నమలి నీళ్లు తాగాలి. * గసగసాలు రుబ్బేముందు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతాయి. * ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.