News March 25, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.9 °c, వీర్నపల్లి 37.8°c, గంభీరావుపేట 37.8°c, కోనరావుపేట 37.6°c, రుద్రంగి 37.7°c, తంగళ్లపల్లి 35.6°c, ఇల్లంతకుంట 35.9°c,ఎల్లారెడ్డిపేట 35.0°cలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News February 24, 2026
పెద్దపల్లి: రైతుల కోసం వేగవంతమైన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

పెద్దపల్లి సర్కిల్‌లో రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు చేస్తున్నట్లు ఎస్‌ఈ వి.గంగాధర్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 344 సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
News February 24, 2026
భూపాలపల్లి: మత్స్యకారులకు గుడ్ న్యూస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాల సభ్యులకు “మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్” పథకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 13 యూనిట్లు మంజూరు చేయనున్నారు. జనరల్ వారికి 40%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 60% సబ్సిడీ ఉంటుంది. అర్హులు మార్చి 5, 2026లోగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు.
News February 24, 2026
జిల్లాలో వేగవంతంగా శనగల కొనుగోలు ప్రక్రియ

జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ (DLPC) సమావేశం జరిగింది. క్వింటా శనగ రూ.5,875 మద్దతు ధరను నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా పంట సేకరణ కోసం ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలను ఖరారు చేశామన్నారు.


