News April 2, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటలలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 38.1 °c, సిరిసిల్ల 38.0°c, ఇల్లంతకుంట 37.6°c,రుద్రంగి 37.5 °c,కోనరావుపేట 37.4°c, తంగళ్ళపల్లి 37.3 °c, ఎల్లారెడ్డిపేట 35.0°c లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు మండలాలలో వాతావరణం స్వల్పంగా చల్లబడింది.
Similar News
News November 20, 2025
HYD: ఆందోళన కలిగిస్తున్న రేబిస్ మరణాలు

నగరవాసులను రేబీస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పరిధిలో రేబీస్తో చనిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది సెప్టెంబరు వరకు 32కు చేరింది. 2023లో 13, 2024లో 16 మంది మృతి చెందితే ఈఏడాది ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ఏటా 20వేల మంది కుక్కకాటు బాధితులు వస్తారని సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
News November 20, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు
* ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు
* లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు పైపైకి
* 100వ టెస్టులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫీకర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్గా రికార్డు
News November 20, 2025
వేములవాడ: యువకుడి మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

వేములవాడ డ్రైనేజీలో పడి<<18336834>> ఓ యువకుడు మృతి <<>>చెందిన ఘటనా స్థలాన్ని వేములవాడ పట్టణ పోలీసులు పరిశీలించారు. స్థానిక రెండో బైపాస్ రోడ్డులోని బతుకమ్మ తెప్ప సమీపంలోని డ్రైనేజీలో బుధవారం అర్ధరాత్రి తరువాత ద్విచక్రవాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని స్థానిక ఉప్పుగడ్డ వీధికి చెందిన గోవిందు అభినవ్(25)గా గుర్తించారు.


