News April 10, 2025
సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ UPDATE

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లోనే మార్నింగ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 40.8°c, వేములవాడ రూరల్ 40.8°c, కొనరావుపేట 40.7°c, సిరిసిల్ల 40.6 °c,రుద్రంగి 40.3 °c, చందుర్తి 39.9 °c,తంగళ్లపల్లి 39.7°c, ఇల్లంతకుంట 39.6°c, ఎల్లారెడ్డిపేట 39.2°c, గంభీరావుపేట 39.0 °c ముస్తాబాద్ 39.0°c,లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News January 11, 2026
సూర్యాపేట: కూలీ నుంచి.. వెండితెరపై గేయ రచయితగా

మేళ్లచెరువు మట్టి మనిషి కల్యాణ్ చక్రవర్తి తన సాహితీ ప్రతిభతో సినీ గేయ రచయితగా రాణిస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన, చదువుకునే రోజుల్లో పొలం పనులు చేస్తూ, స్థానిక ఫ్యాక్టరీలో కూలీ పనిచేస్తూనే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 118చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. తాజాగా అఖండ-2లో పాటలతో పాటు డైలాగులు కూడా రాశారు. ప్రస్తుతం మరో 20సినిమాలకు పాటలు రాస్తున్నట్లు తెలిపారు.
News January 11, 2026
ISRO Anvesha.. వీడియో గేమ్‌లా అటాక్

రేపు PSLV-C62తో అన్వేష ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపుతోంది. ఈ DRDO శాటిలైట్ ఓ సూపర్ పవర్ కెమెరా. 150Kgs బరువుండే ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ కాంతి తరంగాలు విశ్లేషిస్తూ క్షేత్రస్థాయిలోని లైవ్ ఫీడ్ అందిస్తుంది. చొరబాట్లు, కూరగాయల బుట్టల్లో తరలించే ఆయుధాలు, ఉగ్రవాద షెల్టర్లు ఇలా అన్నింటిపై ఆర్మీకి రియల్ టైమ్ డేటా అందుతుంది. దీంతో వీడియో గేమ్ ఆడినట్లుగా జవాన్లు ఆపరేషన్స్‌లో పాల్గొనవచ్చు.


