News March 22, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎండలు కొడుతూనే వర్షాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు ఎండలు కొడుతూనే మరోవైపు పలు మండలాలలో వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 37.6°c, ఇల్లంతకుంట 37.6°c, తంగళ్ళపల్లి 37.5°c, గంభీరావుపేట 37.5°c, సిరిసిల్ల 37.4 °c,చందుర్తి 37.2°c, వేములవాడ 37.1°c, ఎల్లారెడ్డిపేట 35.8 °c లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం
News November 28, 2025
శ్రీకాకుళం: ‘రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి’

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఏపీ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వరరావు అన్నారు. శాసన సభ అంచనాల కమిటీ 2024-25 ఈ నెల 27,28 తేదీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై కమిటీ సమీక్షిస్తుందన్నారు.
News November 28, 2025
NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తరుడు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పంపిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదించి, నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డిఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.


