News March 26, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎక్కువైన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండ ఎక్కువైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రోజు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 39.0°c, కోనరావుపేట 38.9°c, రుద్రంగి 38.5°c, సిరిసిల్ల 38.4°c, °c,తంగళ్ళపల్లి తంగళ్లపల్లి 37.8°c, వేములవాడ 37.2°c, ఎల్లారెడ్డిపేట 37.2°c,లుగా నమోదు అయ్యాయి. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు సూచనలు జాగ్రత్తగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News April 3, 2025
TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: డీఈవో

విశాఖ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 25లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మే1 నుంచి జూన్ 11 వరకు ట్రైనింగ్ ఇవన్నున్నట్లు తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. పూర్తి వివరాలు, అప్లికేషన్‌కు www.bse.ap.gov.inలో చెక్ చేయాలన్నారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.
News April 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 3, 2025
BREAKING: వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభించింది. ఓటింగ్‌లో మొత్తం 390 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు.