News February 5, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.

News November 3, 2025

టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

image

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.

News November 3, 2025

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ASF ఎస్సీ

image

బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.