News February 5, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
మంచిర్యాల: పావురం కోసం క్రేన్ పంపిన కలెక్టర్

నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌లో సెంట్రల్ లైటింగ్ స్తంభంపై ఓ పావురం గాలిపటం దారానికి చిక్కుకుంది. గమనించిన స్థానికులు కలెక్టరేట్‌కు సమాచారం అందజేయడంతో స్పందించి కలెక్టర్ క్రేన్‌ను పంపించారు. అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది నిచ్చెన సాయంతో పైకి ఎక్కి దాన్ని విడిపించారు. దీంతో పావురం అక్కడనుంచి స్వేచ్ఛగా ఎగిరిపోయింది.
News February 9, 2025
భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.
News February 9, 2025
లెబనాన్‌లో ఎట్టకేలకు పూర్తిస్థాయి సర్కారు

రెండేళ్ల నుంచి అట్టుడుకుతున్న లెబనాన్‌లో ఎట్టకేలకు శాంతి దిశగా అడుగులు పడ్డాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ స్థానంలో పూర్తిస్థాయి సర్కారు ఏర్పాటుకు దేశాధ్యక్షుడు జోసెఫ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రధాని నవాఫ్ సలామ్, తన 24మంది సభ్యుల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేస్తామని, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు సలామ్ హామీ ఇచ్చారు.