News March 23, 2025
సిరిసిల్ల జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. చికెన్ స్కిన్ 178/- kg, స్కిన్లెస్ 203/-kg, బోన్ లెస్ చికెన్ 394/-kg, లైవ్ బోర్డ్ (కోడి)101/-kg, కోడిగుడ్లు ఒక ట్రేకు 127/- (30) లుగా షాపు యజమానులు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ ధరలు పలు ప్రాంతాలలో హెచ్చుతగ్గులుగా ఉండవచ్చని పౌల్ట్రీ రైతులు తెలిపారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: పవన్ కళ్యాణ్ SORRY చెప్పాలి: కోమటిరెడ్డి

తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. పవన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, తెలియక మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడబోవని మంత్రి హెచ్చరించారు.
News December 2, 2025
చైనా మాంజాలపై నిర్మల్ పోలీసుల పంజా

జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పతంగులు ఎగరేసే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజ వినియోగం, రవాణా, నిల్వ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కిరాణా దుకాణాలు, చిన్నపాటి వ్యాపార కేంద్రాలను సందర్శించి చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 2, 2025
నల్గొండ: ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్కు నోచుకోని గ్రామాలు!

నల్గొండ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్పల్లి, నిడమనూర్, గుండ్రంపల్లి, వెలిమనేడు, పెద్ద కాపార్తి, పెద్దదేవులపల్లి, ముత్యాలమ్మ గూడెం, చందంపేట, పులిచెర్ల, దాచారం , అంగడిపేట, వీర్లపాలెం, పగిడిమర్రి, కొండూరు, ఎర్రగండ్లపల్లి ఇలా దాదాపు 27 పంచాయతీలకు ఒక్కసారి కూడా సర్పంచ్ SC రిజర్వ్ కాలేదు.


