News April 3, 2025

సిరిసిల్ల జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎండ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. వీర్నపల్లి 36.9 °c, గంభీరావుపేట 36.8°c, కోనరావుపేట 36.3, సిరిసిల్ల 36.2, ఇల్లంతకుంట 36.0°c, బోయిన్పల్లి 36.1°c, చందుర్తి 35.2°c, రుద్రంగి 35.0 డిగ్రీలుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం పలు మండలాలలో మేఘాలు కమ్ముకుపోయి చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి.

Similar News

News April 22, 2025

సంగారెడ్డి: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా RYV అందించాలి: కలెక్టర్

image

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని బ్యాంకులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 51,657 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News April 22, 2025

పెద్దపల్లి: ఈనెల 30లోపు రాజీవ్ యువ వికాసం వెరిఫికేషన్ పూర్తి: కలెక్టర్

image

ఈనెల 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా లక్ష్యాల కేటాయింపు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు. DRDO కాలిందిని, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

News April 22, 2025

నేషనల్స్‌లో మంచిర్యాల వాసికి గోల్డ్ మెడల్

image

బెల్లంపల్లికి చెందిన సింగరేణి క్రీడాకారుడు శ్రీనివాసచారి నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈనెల 20 నుంచి 22 వరకు జరుగుతున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 55ఏళ్ల విభాగం పోటీలో పాల్గొని హై జంప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించడంపై మందమర్రి సింగరేణి వర్క్‌షాప్ సహచర మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!