News April 13, 2025
సిరిసిల్ల జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.234, కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.206, కేజీ చికెన్ బోన్ లెస్ రూ.434, కేజీ చికెన్ రిటైల్ రూ.142, కేజీ కోడి లైవ్ బర్డ్ రూ.120, కేజీ చికెన్ హోల్ సేల్ రూ.125, 100 కొడిగుడ్లకు 390 రూపాయలుగా ఉన్నట్లు మార్కెట్లోని షాపు యజమానులు తెలిపారు.
Similar News
News October 15, 2025
JGTL: పేదల సంక్షేమం కోసం కృషి చేస్తా: MLC రమణ

పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని MLC రమణ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2,65,500 విలువగల చెక్కులను ఎమ్మెల్సీ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో BRS నాయకులు గట్టు సతీష్, తేలు రాజు, అల్లాల ఆనంద్ రావు, బర్కాం మల్లేశం, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News October 15, 2025
పత్తి దిగుబడి పెరగాలంటే..

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.
News October 15, 2025
శ్రీరాంపూర్: 20న సింగరేణి ఉద్యోగులకు దీపావళి సెలవు దినం

సింగరేణి ఉద్యోగులకు ఈనెల 20న దీపావళి పండుగ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులకు సెలవు రోజున సాధారణ వేతనంతో పాటు మూడింతలు అధికంగా వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.