News April 13, 2025
సిరిసిల్ల జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.234, కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.206, కేజీ చికెన్ బోన్ లెస్ రూ.434, కేజీ చికెన్ రిటైల్ రూ.142, కేజీ కోడి లైవ్ బర్డ్ రూ.120, కేజీ చికెన్ హోల్ సేల్ రూ.125, 100 కొడిగుడ్లకు 390 రూపాయలుగా ఉన్నట్లు మార్కెట్లోని షాపు యజమానులు తెలిపారు.
Similar News
News April 16, 2026
డ్రైవర్ల కంటి పరీక్షా శిబిరం పరిశీలించిన కలెక్టర్

‘అరైవ్-అలైవ్’ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ పరీక్షా విభాగాలను సందర్శించిన ఆయన.. వైద్య పరీక్షల విధానం, పరికరాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
News April 16, 2026
మహిళా సాధికారతకు తెలుగుదేశమే ఆద్యం: ఎంపీ బైరెడ్డి శబరి

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్‌లో కీలక ప్రసంగం చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత టీడీపీదేనని అన్నారు. గత వైసీపీ పాలనలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నామని, దేశంలోనే డ్వాక్రా కార్యక్రమం అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఆమె కొనియాడారు.
News April 16, 2026
KMR: నేటితో ముగిసిన పదో తరగతి పరీక్షలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారంతో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 100 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో రాజు వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. విద్య, వైద్య, పోలీసు అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.


