News April 12, 2025
సిరిసిల్ల జిల్లాలో భానుడు భగభగ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సిరిసిల్ల 41.4 °c,రుద్రంగి 41.3 °c, ఇల్లంతకుంట 41.2 °c,వీర్నపల్లి 41.1°c, గంభీరావుపేట 40.9 °c,వేములవాడ రూరల్ 40.9°c, కోనరావుపేట 40.4 °c,ఎల్లారెడ్డిపేట 40.2 °c,బోయిన్పల్లి 40.1°c,ముస్తాబాద్ 39.9 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతవరణశాఖ ఆరెంజ్ జోన్ ప్రకటించింది.
Similar News
News January 14, 2026
సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
News January 14, 2026
గాలిపటాల వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ నితికా పంత్

సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. విద్యుత్ తీగలు, ప్రమాదకర ప్రాంతాల్లో పటాలు ఎగురవేయవద్దని కోరారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఆనందాన్ని ఇబ్బందుల పాలు చేసుకోకుండా, నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా జరుపుకోవాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News January 14, 2026
పండగ పూట.. హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి వద్ద హైవే పనులు చేస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కేశవాపూర్‌కు చెందిన పాల వ్యాపారి ఈర కుశుడు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జైంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. కుశుడికి భార్య స్నేహ, పిల్లలు ఉన్నారు.


