News March 17, 2025
సిరిసిల్ల జిల్లాలో మండుతున్న ఎండలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత ఎక్కువౌతుంది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 424°c, కొనరావుపేట 41.7°c, వేములవాడ రూరల్ 45.3°c, గంభీరావుపేట 40.4°c, చందుర్తి 45.3°c, సిరిసిల్ల 40.2°c, రుద్రంగి 45.1°c, ఎల్లారెడ్డిపేట 40.0°c, బోయిన్పల్లి 39.4°c, తంగళ్లపల్లి 39.1°c, ఇల్లంతకుంట 38.7°cలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News November 22, 2025
వరంగల్ DCC అధ్యక్షుడిగా మహమ్మద్ ఆయూబ్

వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఆయూబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నగరానికి చెందిన ఆయూబ్ గతంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సన్నిహితుడిగా గెలుస్తోంది. దీనికి తోడు ఈసారి మైనార్టీ వర్గానికి అధ్యక్ష పదవి దక్కింది.
News November 22, 2025
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే..?

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాజేంగి నందయ్యను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కల్వకుంట్ల సుజీత్ రావు, జువ్వాడి నర్సింగ రావు కూడా పోటీలో ఉన్నప్పటికీ.. అధిష్ఠానం గాజేంగి నందయ్య వైపు మొగ్గు చూపింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News November 22, 2025
రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్లతో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


