News March 7, 2025

సిరిసిల్ల జిల్లాలో మార్నింగ్ ఉష్ణోగ్రతల అప్డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటలలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా నమోదు అయ్యాయి. గంభీరావుపేట 35.0°c, వీర్నపల్లి 35.0°c ఉన్నాయి. ఇలా ఉండగా ఎండలు కొడుతూనే చలి మండలాలు సిరిసిల్ల 34.9°c, కోనరావుపేట 34.5°c, వేములవాడ 34.5°c, ఎల్లారెడ్డిపేట 34.0°c, రుద్రంగి 34.0°c, ఇల్లంతకుంట 34.0°c, చందుర్తి 33.3°c, బోయిన్పల్లి 33.2°c లుగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News October 14, 2025

మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు

image

AP: హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై సిట్ రైడ్స్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈక్రమంలో మరోసారి సిట్ తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News October 14, 2025

L.C.A-643 మిరప రకం ప్రత్యేకతలు ఇవే

image

పచ్చిమిర్చితో పాటు ఎండు మిర్చికి కూడా అనువైన రకం L.C.A-643. ఈ మిర్చి కాయలు లేత ఆకుపచ్చరంగులో పొడవుగా 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయలు ఎండిన తర్వాత కూడా కాస్త ముడతపడి ఆకర్షణీయమైన రంగులో ఉంటాయి. ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. జెమిని వైరస్‌ను కూడా కొంత వరకు తట్టుకుంటుంది. నల్లతామర పురుగు సోకినా కొద్దిపాటి పురుగు మందులను పిచికారీ చేస్తే దీన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది.

News October 14, 2025

గోదావరిఖని: ‘రుణాలు మంజూరు చేసి సహకరించాలి’

image

స్వశక్తి సంఘాలకు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని రామగుండం ఇన్‌ఛార్జి కమిషనర్‌ జే.అరుణశ్రీ అన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం టీఎల్‌బీసీ సమావేశం జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను మొదటి, 2వ, 3వ విడతలు సకాలంలో మంజూరు చేయాలని ఆమె కోరారు.