News March 28, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 విద్యార్థులు పరీక్ష రాశారు. 14 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని తెలిపారు.
Similar News
News April 3, 2025
తిరుపతి: గంజాయి కేసులో GRP కానిస్టేబుల్ అరెస్ట్

డబ్బుకు ఆశపడి ఓ రైల్వే పోలీస్ పక్కదారి పట్టాడు. గూడూరుకు చెందిన అవినాశ్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రైళ్లలో తనిఖీలు చేసే సమయంలో దొరికిన గంజాయిని తన ఫ్రెండ్ సునీల్ ద్వారా విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో సునీల్ గూడూరు టూ టౌన్ పోలీసులకు చిక్కాడు. ఐదు ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సునీల్ ఇచ్చిన సమాచారంతో అవినాశ్‌ను అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.
News April 3, 2025
ఈ నెలలోనే ఏపీలో PM మోదీ పర్యటన!

AP: అమరావతి పనులను పున:ప్రారంభించేందుకు PM మోదీ ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో CS విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. PM పర్యటన తేదీ త్వరలో ఖరారు కానున్న నేపథ్యంలో శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ప్రధాని ఇవాళ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాగానే AP పర్యటన తేదీ ఫిక్స్ కానుంది.
News April 3, 2025
IPL: KKRపై SRH పైచేయి సాధిస్తుందా?

ఐపీఎల్లో భాగంగా ఇవాళ KKR-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు వరుస ఓటములతో డీలాపడ్డ ఆరెంజ్ ఆర్మీ తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కేకేఆర్‌ను ఓడించి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కేకేఆర్ ఒక గెలుపు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ మ్యాచులో గెలిచి సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.