News February 17, 2025

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ఫిబ్రవరి 22న శనివారం నుంచి సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కందుల కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేమ 12 శాతంలోపు ఉన్న కందులకు రూ.7,550 మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. 

Similar News

News December 10, 2025

గ్రేటర్ వరంగల్‌లో డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు!

image

గ్రేటర్ వరంగల్ సమీప ప్రాంతాలు మరోసారి విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 డివిజన్‌లను పెంచాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మడికొండ, రాంపూర్ దాటిన నగరం పెండ్యాల వరకు పెంచాల్సి వస్తోంది. దీంతో పాటు గీసుగొండ, దామెర, ఎల్కతుర్తి, ఐనవోలు వరకు విస్తరణ ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విలీన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

News December 10, 2025

టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

image

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 10, 2025

WGL: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్-1పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.