News February 17, 2025

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ఫిబ్రవరి 22న శనివారం నుంచి సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కందుల కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేమ 12 శాతంలోపు ఉన్న కందులకు రూ.7,550 మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. 

Similar News

News March 18, 2025

సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

image

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.

News March 18, 2025

టెన్త్ అర్హత.. CISFలో 1,161 ఉద్యోగాలు

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ITI పాసైన 18-23 ఏళ్లలోపు వారు అర్హులు. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/

News March 18, 2025

పెద్దపల్లి: నేడు ఇంటర్మీడియట్ పరీక్షలకు 111మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4927 విద్యార్థులకు 4816 హాజరయ్యారని  పేర్కొన్నారు. 111 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 71 మంది, వొకేషనల్ 40మంది విద్యార్థులు హాజరుకాలేదన్నారు.

error: Content is protected !!