News February 4, 2025

సిరిసిల్ల: జిల్లా BJP అధ్యక్షుడు ఎవరో..?

image

బీజేపీ నూతన అధ్యక్షుల ప్రకటనలో భాగంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. మిగతా 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. రెడ్డి, మున్నూరు కాపులకు 6, 4-గౌడ్స్‌, వైశ్య, ఎస్సీలకు 2, కమ్మ, ఆర కటిక, పద్మశాలీ, పెరిక, ముదిరాజ్‌లకు 1 చొప్పున BJP అధ్యక్షులను నియమించింది. అయితే ఇప్పటివరకు సిరిసిల్ల అధ్యక్షుడినైతే ప్రకటించలేదు.కాగా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 14, 2026

ఆ బౌలర్‌తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

image

రేపు పాక్‌తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని టీమ్‌ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్‌ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.

News February 14, 2026

RR: ఇద్దరికి సున్నా.. వారి ఓటెవరికి వేసినట్లు?

image

RR మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు. చేవెళ్ల 5th వార్డులో TRP అభ్యర్థి రాజుకు ఒక్క ఓటూ పడలేదు. తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. 1st వార్డులో BJP అభ్యర్థి శ్రీనివాస్‌కు 2ఓట్లు రాగా 4వవార్డు BJP అభ్యర్థి కేశపల్లి భాగ్యమ్మకు 2ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 2nd వార్డ్‌లో అలీకి ఓట్లురాలేదు. 19thవార్డులో BSP అభ్యర్థి రఘుపతికి 1ఓటు పడింది. శంకర్‌పల్లిలో 13వవార్డు జనసేన అభ్యర్థి సాయికి 2ఓట్లు పడ్డాయి.

News February 14, 2026

పాలమూరు పురపోరు.. కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన MBNR కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, 18 మున్సిపాలిటీలలో 316 వార్డులు ఉండగా..
కాంగ్రెస్‌ 30 డివిజన్లు, 179 వార్డులు,
BRS 15 డివిజన్లు, 75 వార్డులు,
BJP 7 డివిజన్లు, 38 వార్డులు,
AIFB 9(W),
MIM 6(W),
ఇండిపెండెంట్‌లు 9(W),
CPM రెండు స్థానాలు గెలుపొందాయి.
మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది.