News March 18, 2025

సిరిసిల్ల: ట్రాక్టర్ ఢీకొని గొర్ల కాపరి మృతి

image

బోయినపల్లి నుంచి వేములవాడ వెళ్లే రహదారిలో గల పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి  మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన సుంకానీ మల్లేశం అనే గొర్ల కాపరి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పెట్రోల్ బంకు వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 25, 2025

విజయవాడలో ఎమ్మెల్యేల సమావేశం

image

విజయవాడలో శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ భేటీలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. అయితే, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం.

News October 25, 2025

ఇతర పదవుల్లో ఉండే వారికి DCC రాదు: PCC చీఫ్

image

TG: సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. మ.3కు అధిష్ఠానం CM, Dy.CMతో పాటు నా అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుంది. సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC ఇవ్వరాదనే నియమం ఉంది. అలాంటి వారికి ఈ పదవి రాదు’ అని స్పష్టం చేశారు.

News October 25, 2025

విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలి: అడ్లూరి

image

విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఇతర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో విద్యా, వసతి, శానిటేషన్, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.