News March 18, 2025

సిరిసిల్ల: డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం

image

డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మనోహర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ బీసీ యువతీ, యువకులు ఈనెల 31 వరకు సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ డ్రైవింగ్ ఉచిత ట్రైనింగ్ హైదరాబాదులోని హకీంపేటలో ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

image

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

NABFINSలో ఉద్యోగాలు

image

<>NABARD <<>>ఫైనాన్షియల్ సర్వీసెస్ (NABFINS)21 రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం, రాయడం, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: https://nabfins.org/