News February 27, 2025
సిరిసిల్ల: తంగళ్లపల్లి, చందుర్తి, రుద్రంగి అత్యధికం, బోయినపల్లిలో అత్యల్పం

సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో తంగళ్లపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాలలోని పోలింగ్ కేంద్రాలలో అత్యధికంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బోయిన్ పల్లిలో 78.26 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ గత 22 నెలల పాలన ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. రేవంత్ రెడ్డి భయంతో HYD ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. నగరాభివృద్ధి కొనసాగాలంటే BRS మళ్లీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ నుంచి విజయయాత్రను ప్రారంభించాలని సూచించారు.
News September 16, 2025
జగిత్యాల: ‘కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం’

కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
News September 16, 2025
మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.