News March 17, 2025

సిరిసిల్ల: త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో పెట్టకుండా అన్ని దరఖాస్తులను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News March 18, 2025

భారీ లాభాల్లో మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News March 18, 2025

సిద్దిపేట: ‘కుటుంబమే విద్యార్థుల వికాసానికి పునాది’

image

కుటుంబంలోని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల ప్రభావం విద్యార్థులపై బలంగా ఉంటుందని ప్రముఖ మనో వికాస శాస్త్రవేత్త, విద్యా కౌన్సిలర్ డాక్టర్ సి. వీరేందర్ అన్నారు. సిద్దిపేటలో నిన్న జరిగిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తమ విద్యార్థులను తయారు చేయడానికి కుటుంబం పునాది వంటిదని అన్నారు.

News March 18, 2025

అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

image

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.

error: Content is protected !!