News April 3, 2025

సిరిసిల్ల: దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ధరణి దరఖాస్తులపై గురువారం వీసీ నిర్వహించారు. జిల్లాలో మొత్తం పెండింగ్ ఉన్న 408 ధరణి దరఖాస్తులను వారం రోజుల్లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్డీవోలు రాదాబాయి, రాజేశ్వర్, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

image

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.

News April 18, 2025

కర్ణాటకలో ప్రమాదం.. నలుగురు హిందూపురం వాసుల మృతి

image

హిందూపురానికి చెందిన నలుగురు వ్యక్తులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ వెళ్తుండగా బొలెరో- ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నాగరాజు, సోము, నాగభూషణ్, మురళిగా గుర్తించామన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 18, 2025

పెద్దపల్లికి చేరుకున్న నాగస్వాముల బృందం

image

మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న నాగస్వాముల బృందం శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా హైవే వద్దకు చేరుకుంది. లోక కళ్యాణం కోసం మధురై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేస్తున్నట్లుగా నాగస్వాములు పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రయాణంలో అనేక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు.

error: Content is protected !!