News March 3, 2025
సిరిసిల్ల: దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి 108 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News December 4, 2025
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.
News December 4, 2025
ADB: రోడ్లే దిక్కులేవంటే.. ఎయిర్ పోర్టు ఎందుకు.?

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్లు లేక ఆదివాసీ బిడ్డలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకులు ఎవరు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నవంబర్ నెలలో రోడ్లు లేక ముగ్గురు గర్భిణులు ప్రాణాలు విడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ఎయిర్ పోర్టు తెచ్చి ఆదివాసీలను ఫ్లైట్స్లో తరలిస్తారా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.


