News March 3, 2025

సిరిసిల్ల: దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి 108 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News March 28, 2025

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

image

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.

News March 28, 2025

జగిత్యాల: వరి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి

image

రాబోయే యాసంగికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ కనెక్షన్, ఆన్‌లైన్ వసతి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

News March 28, 2025

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

image

TG: ఇవాళ్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

error: Content is protected !!