News March 10, 2025

సిరిసిల్ల: దరఖాస్తుల ఆహ్వానం: రాఘవేందర్ రావు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జోలి శాఖ సహాయ సంచాలకులు రాఘవేందర్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

Similar News

News March 8, 2026

సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా!

image

సీఎం చంద్రబాబు నంద్యాల(D) డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సోమవారం పర్యటించనున్నారు. పర్యటన వివరాలను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ‘మాభూమి-మాహక్కు’ గ్రామ సభలో పాల్గొని నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి, 2.40కు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయలన్నారు.

News March 8, 2026

కామారెడ్డి: మహిళా అధికారులే ఆదర్శం

image

కామారెడ్డి జిల్లాలో పలు శాఖల్లో ఉన్నత స్థానంలో మహిళలే అధికారులుగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ మహిళలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా జూనియర్ సివిల్ జడ్జి బట్టు దీక్ష, DLSA కార్యదర్శి నాగరాణి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎఫ్ఓ నిఖిత, డీడబ్ల్యూఓ ప్రమీల, డీసీపీఓ డా.స్రవంతి, హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.విద్య ఆదర్శంగా నిలుస్తున్నారు.

News March 8, 2026

మంచిర్యాల: సర్వేయర్ల కొరతతో నిలిచిపోతున్న సర్వే

image

మంచిర్యాల జిల్లాలో సర్వేయర్ల కొరతతో భూ సర్వే నిలిచిపోతోంది. మొత్తం 18 మండలాలు ఉండగా, కేవలం 8 మండలాలకే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు, మూడు మండలాల బాధ్యతలను అధికారులు అప్పగించారు. పిటీషన్ పెట్టుకున్న దరఖాస్తుదారుల భూముల సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్లు వచ్చిన వారికి విధులు, బాధ్యతలు అప్పగించలేదు. జిల్లాలో భూముల సర్వే నత్త నడకన కొనసాగుతోంది.