News April 14, 2025
సిరిసిల్ల: దేశానికి దిక్సూచి అంబేడ్కర్: ఎస్పీ

దేశానికి దిక్సూచి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశానికి రాజ్యాంగం రచించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచిపోయాడన్నారు.
Similar News
News November 27, 2025
పాలమూరు: మాజీ సర్పంచ్ హత్య.. చేసింది వీళ్లే.!

కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, నాలుగు కార్లు, రెండు బైకులు, ఒక బొలెరో వాహనం, 11 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధరూర్ మండలం జాంపల్లి వద్ద చిన్న భీమరాయుడును బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
FLASH.. HNKలో సిగ్మా జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన

హనుమకొండలో ఆందోళన నెలకొంది. బట్టుపల్లి వద్ద ఉన్న సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి కనిపించకపోవడంతో విద్యార్థి తండ్రి కాలేజీ బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
News November 27, 2025
BREAKING: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

సున్నంచెరువు కూల్చివేతల వ్యవహారంపై హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. FTL నిర్ధారణ లేకుండా హద్దులు నిర్ణయించడం, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పట్టించుకోకపోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సియేట్ మారుతీహిల్స్ కాలనీలో ఇకపై ఫెన్సింగ్, కూల్చివేత చర్యలకు దిగొద్దని హైకోర్టు హెచ్చరించింది.


