News March 20, 2025
సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు: కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25లో పండిన నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ తన చాంబర్లో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
Similar News
News April 1, 2025
‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డ్

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్‌మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.
News April 1, 2025
అసదుద్దీన్‌తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

TG: హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.
News April 1, 2025
పన్నుల ద్వారా ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం: కమిషనర్

పన్ను ద్వారా బల్దియాకు సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వసూలు చేసినట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. హన్మకొండ అశోక టాకీస్ వద్ద గల ఈ సేవా కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. రెగ్యులర్ పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ పథకంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు జరిపామని అన్నారు.