News February 14, 2025
సిరిసిల్ల: నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణలో విద్యార్థులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఈఈటీని ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలు, అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు వివరాలు తెలుస్తాయన్నారు.
Similar News
News October 23, 2025
సిద్దిపేట: నేటి కేబినెట్ భేటీపై ఆశావహుల ఆశలు

నేడు జరుగనున్న కేబినెట్ భేటీపై ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. నోటిఫికేషన్ వెలువరించటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి విడుదల చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యువతకు రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వయసు, బాధ్యతలు పెరిగి రాజకీయాలు చేయలేమని అంటున్నారు.
News October 23, 2025
ధర్మపురి: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ధర్మపురి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతి సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు MCA/ M.Sc కంప్యూటర్ సైన్స్లో 55% మార్కులు ఉన్నవారు Ph.D/ NET/ SET అర్హతగల అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 24 శుక్రవారం రోజున నేరుగా కళాశాలలో హాజరుకావాలని ప్రిన్సిపల్ రాధ కిషన్ ఒక ప్రకటన ద్వారా కోరారు.
News October 23, 2025
సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లోఅప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.