News April 13, 2025
సిరిసిల్ల : నాలుగోతరగతి పరీక్షల్లో ఆసక్తికర సమాధానం రాసిన విద్యార్థిని

రాజన్న సిరిసిల్ల(D) చందుర్తి(M)లోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికర సమాధానం రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది, నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో పేపర్ దిద్దిన టీచర్ ఆశ్చర్యపోయారు. నేటికాలంలో కోడళ్ళకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో ఈ లేఖ తెలియజేస్తోంది.
Similar News
News April 17, 2025
గన్నేరువరంలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరై మాట్లాడారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 17, 2025
కరీంనగర్: డిజిటల్ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అధికంగా వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
News April 17, 2025
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.