News February 15, 2025

సిరిసిల్ల: నిరంతరం నిఘా పెట్టాలి: కలెక్టర్

image

ఇసుక రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ, ఎంఆర్ఓలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.. జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తరలించాలని తెలిపారు. వే బిల్, డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Similar News

News April 11, 2026

పిఠాపురంలో ఫేక్ లాయర్ హల్ చల్

image

తప్పుడు పత్రాలతో న్యాయవాదిగా చలామణి అవుతున్న వ్యక్తిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన ఒక వ్యక్తి ఇతర జిల్లాకు చెందిన న్యాయవాది రిజిస్టర్ నంబరుతో కోర్టుల్లో న్యాయవాదిగా చలామణి అవుతున్నారని న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పిఠాపురం ఎస్సై మణికుమార్ తెలిపారు.

News April 11, 2026

దేవరకొండ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగి ఘరానా మోసం

image

దేవరకొండ డిండి రోడ్డులోని బ్యాంకులో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించాడు. విదేశాల్లో ఉంటున్న, సుదీర్ఘకాలంగా లావాదేవీలు జరపని వారి అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని అధికారుల కళ్లుగప్పి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసి వాటితో పరారయ్యాడు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులు రహస్యంగా దర్యాప్తు చేపట్టి, నష్టపోయిన సొమ్ముపై లెక్కలు తీస్తున్నారు.

News April 11, 2026

ప.గో: పెళ్లింట తీవ్ర విషాదం

image

పెదవేగిలోని వలసపల్లి సమీపంలో <<19612501>>గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి(M)ముక్కంపాడుకు<<>> చెందిన సచివాలయ ఉద్యోగి సుధీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇతని భార్య గర్భిణీ. అంతేకాకుండా మరోవైపు మృతుని సోదరునికి ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో పెళ్లింట శోక సంద్రంలో మునిగిపోయారు.