News February 14, 2025
సిరిసిల్ల: నిర్వహణ పారదర్శకంగా నిర్వర్తించాలి: శేషాద్రి

ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పారదర్శకంగా నిర్వర్తించాలని డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్ బుక్కులు చదువుకొని సజావుగా ఎన్నికల జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి లోకేశ్

శీతాకాలం కావడంతో అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురుకుల, కేజీబీవీ హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులు చలికి వణికి స్కూల్స్‌కు వెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది. ఆయా హాస్టల్స్‌లోని స్టూడెండ్స్ ఆరోగ్య రీత్యా తగిన వసతులను కల్పించి, సమస్య పరిష్కరించాలని నేడు ‘X’ ఖాతా ద్వారా కలెక్టర్‌ను కోరారు.
News December 17, 2025
శ్రీరాంపూర్: రేపు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా చెల్లింపు

సింగరేణి సంస్థలో 2024-25లో రిటైరైన కార్మికులకు 35 శాతం లాభాల వాటాను గురువారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. అలాగే దీపావళి బోనస్(పీఎల్ఆర్) ఈనెల 23న చెల్లించనున్నట్లు వారు పేర్కొన్నారు. తమ సంఘం ఒత్తిడి మేరకు యాజమాన్యం అంగీకరించిందని.. ఈ విషయాన్ని విశ్రాంత కార్మికులు గమనించాలని వారు కోరారు.
News December 17, 2025
వెల్గటూర్: డ్రా పద్ధతి ద్వారా వరించిన సర్పంచ్ పదవి

వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామంలో సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలువగా, ఇద్దరు అభ్యర్థులకు 155 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా.. కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కోటయ్యను అదృష్టం వరించింది.


