News March 15, 2025

సిరిసిల్ల: నీటి సరఫరాకు అంతరాయం: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

image

సిరిసిల్లలోని 120MLD నీటి శుద్ధి కేంద్రంలోని తాగునీరు నీటి పంపు హౌస్‌లో పంపుల మరమ్మతు జరుగుతున్నందున ఈనెల 16న సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE శేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ఈనెల 17వ తేదీన నీటి సరఫరా యథావిధిగా సాగుతుందని ప్రజలు సహకరించాలన్నారు.

Similar News

News February 25, 2026

ప్రియురాలితో బిగ్‌బాస్ నటుడి ఎంగేజ్‌మెంట్

image

యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రేయసి వైష్ణవిని పరిచయం చేసిన అతడు ఇవాళ ఆమెకు రింగ్ తొడిగారు. ఈ ఫొటోలను SMలో షేర్ చేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. కాగా బిగ్‌బాస్-5లో షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు.

News February 25, 2026

సిద్దిపేట: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

image

బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.

News February 25, 2026

రేపు కోదాడకు కేటీఆర్ రాక!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కోదాడకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఇటీవల పోలీస్ లాకప్ డెత్‌లో మృతి చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.