News March 7, 2025

సిరిసిల్ల: నూతన ఎస్పీగా మహేశ్ బాబా సాహెబ్ గీతే

image

సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా మహేష్ బాబా సాహెబ్ గీతే నూతనంగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధానకార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లగా ములుగు జిల్లా ఓఎస్డీగా విధులు నిర్వహించిన మహేష్ బాబా సాహెబ్ గీతే సిరిసిల్ల ఎస్పీగా నియామకమయ్యారు.

Similar News

News December 9, 2025

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్?

image

బ్లాక్‌బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

News December 9, 2025

చాట్ జీపీటీతో కొత్త వంగడాల సృష్టి సులభమా?

image

వాతావరణ మార్పులు, కరవు, వరదల వల్ల వ్యవసాయంలో కొత్త వంగడాల అవసరం పెరిగింది. కొత్త వంగడాల అభివృద్ధికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు.

News December 9, 2025

తిరుపతి: సెమిస్టర్ వస్తున్న హాస్టల్ సీటు రాదా.!

image

TTD శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది 900 మంది చేరారు. అందరికి హాస్టల్ సీటు ఇస్తామని TTD బోర్డు సభ్యులు సైతం హామీ ఇచ్చారు. అయితే సెమిస్టర్ పరీక్షలు వస్తున్నా ఇప్పటి వరకు 350 మందికిపైగా హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. 2 హాస్టల్ భవనాలు ఖాళీగా ఉండగా వాటిని వెంటనే శుభ్రం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు TTD విద్యాశాఖకు హాస్టల్ సీట్ల కోసం ఫైల్ పంపి నెల కాస్తున్న ఎలాంటి స్పందన లేదు.