News March 7, 2025
సిరిసిల్ల: నూతన ఎస్పీగా మహేశ్ బాబా సాహెబ్ గీతే

సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా మహేష్ బాబా సాహెబ్ గీతే నూతనంగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధానకార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లగా ములుగు జిల్లా ఓఎస్డీగా విధులు నిర్వహించిన మహేష్ బాబా సాహెబ్ గీతే సిరిసిల్ల ఎస్పీగా నియామకమయ్యారు.
Similar News
News March 22, 2025
BREAKING: 357 బెట్టింగ్ సైట్స్ బ్లాక్

పన్ను ఎగ్గొడుతున్న ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన DGGI కొరడా ఝుళిపించింది. 357 వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన 2,400 అకౌంట్లలోని రూ.126 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్/గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 22, 2025
సంగారెడ్డి: హిందీ పరీక్షకు 99.82 శాతం హాజరు

పదో తరగతి హిందీ పరీక్షకు 99.82% విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. మొత్తం 22,404 మంది విద్యార్థులకు 22,363 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. కోహిర్‌లో ఒకటి, జహీరాబాద్‌లో ఐదు, మొగుడంపల్లిలో ఒక పరీక్ష కేంద్రాన్ని తాను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 36 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వివరించారు.
News March 22, 2025
కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ సందేశం

ఈరోజు తొలిమ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ KKRకు ఆ జట్టు యజమాని షారుఖ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ‘మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి థాంక్స్. కొత్తగా జట్టులో చేరిన వారికి వెల్‌కమ్. ఈ సీజన్‌లో మనల్ని నడిపించనున్న అజింక్యకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.