News February 27, 2025

సిరిసిల్ల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో పట్టభద్రులు 22,397, ఉఫాధ్యాయులు 950 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయుల స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

Similar News

News February 27, 2025

మరికల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

మరికల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పసుపులకి చెందిన కృష్ణయ్యను గూరకొండ దగ్గర బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 27, 2025

జిల్లాలో 96.54 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 984 ఓటర్లుండగా, మొత్తం 96.54 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

News February 27, 2025

PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!