News March 1, 2025
సిరిసిల్ల: నేరాలను అరికట్టవచ్చు: ఎస్పీ

అప్రమత్తత, అవగాహన ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయమే పెట్టుబడిగా సాగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930 ఫోన్ చేయాలన్నారు. cybercrime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News March 22, 2025
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.
News March 22, 2025
రాష్ట్రంలో 10,954 ఉద్యోగాలు

TG: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News March 22, 2025
MBNR: ఎండ తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

✓ దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలి. ✓ ప్రయాణాల్లో తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ✓ నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.✓సన్నటి, వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ✓ ఎండలో బయటకు వెళ్తే గొడుగు, టోపి వంటివి ఉపయోగించాలి.✓ పగటి వేళలో కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలి.✓ ఆల్కహాల్, టీ, కాఫీ తాగకపోవడం మంచిదని వనపర్తిలోని డాక్టర్లు సూచిస్తున్నారు.