News January 28, 2025
సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ

బ్యాంకుల వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని అదనపు ఎస్పీ డి.చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బ్యాంకు బ్రాంచ్లు, ఏటీఎంల భద్రతపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం సిస్టం అందుబాటులో ఉండాలన్నారు. బ్యాంకు కార్యాలయాలు, ఏటీఎం సెంటర్ల వద్ద తప్పనిసరిగా పనిచేసే సీసీ కెమెరాలు ఉండాలని సూచించారు.
Similar News
News March 13, 2025
అవకాశమిస్తే రీఎంట్రీకి సిద్ధం: పుజారా

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెస్టు స్పెషలిస్ట్ పుజారా హింట్ ఇచ్చారు. జట్టుకు అవసరమైతే తాను ఆడేందుకు సిద్ధమని చెప్పారు. కొన్నేళ్లుగా డొమెస్టిక్, కౌంటీల్లో భారీగా పరుగులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో టీమ్ ఇండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో పుజారాను తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తోంది. 2023 WTC ఫైనల్ పుజారాకు ఆఖరు మ్యాచ్.
News March 13, 2025
SVSC ఐడియా ముందుగా ఆ హీరోకు చెప్పా: శ్రీకాంత్ అడ్డాల

వెంకటేశ్, మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బాక్సాఫీసు వద్ద హిట్గా నిలిచింది. ఈ సినిమా ఐడియాను ముందుగా నాగార్జునకు చెప్పినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉందని చెప్పడంతో చూద్దామన్నట్లు తెలిపారు. అదే సమయంలో సురేశ్ బాబు, వెంకటేశ్ కథ విని ఒకే చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వెంకీ, మహేశ్ కాంబినేషన్ కుదిరిందన్నారు.
News March 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 13, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.