News January 28, 2025

సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ

image

బ్యాంకుల వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని అదనపు ఎస్పీ డి.చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంల భద్రతపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం సిస్టం అందుబాటులో ఉండాలన్నారు. బ్యాంకు కార్యాలయాలు, ఏటీఎం సెంటర్ల వద్ద తప్పనిసరిగా పనిచేసే సీసీ కెమెరాలు ఉండాలని సూచించారు.

Similar News

News February 19, 2025

విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

image

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.

News February 19, 2025

ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

image

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.

News February 19, 2025

శాంతిభద్రతల సమస్య లేకుండా చూస్తాం: నిర్మల్ ఎస్పీ

image

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసాలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భైంసా సబ్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!