News February 1, 2025
సిరిసిల్ల: పట్టభద్రుల ఓటర్లు ఎంతమందంటే..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 28 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 22 వేల 473 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి 13 మండలాల పరిధిలో 928 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారుల వద్ద 149 పట్టభద్రులు, 40 ఉపాధ్యాయుల ఓటర్ నమోదు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పరిశీలించి సకాలంలో డిస్పోస్ చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News December 1, 2025
ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. అధికారులకు షోకాజ్ నోటీసులు

పంచాయతీ ఎన్నికల శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా హాజరుకాని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల విధులు చాలా కీలకమని, సిబ్బందిని సన్నద్ధం చేసేందుకే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీరిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 1, 2025
చిన్నబజార్ PSను తనిఖీ చేసిన గుంటూరు IG

నెల్లూరులోని చిన్నబజార్ PSను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, స్థితిగతులు, నేర ప్రాంతాలపై సిబ్బందిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వీరి వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
News December 1, 2025
నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.


