News March 29, 2025

సిరిసిల్ల : పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

సిరిసిల్ల పట్టణం గీతానగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

Similar News

News November 15, 2025

రేపు బాపట్ల జిల్లాకు రానున్న గవర్నర్

image

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి 11.45కి సూర్యలంక గోల్డెన్ సాండ్ బీచ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.55కి తిరుగు ప్రయాణం అవుతారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

News November 15, 2025

చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

image

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 15, 2025

ఏలూరు: 72 ప్రైవేటు బస్సులపై కేసులు..రూ.7.65 లక్షల జరిమానా

image

ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి రవాణా శాఖ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మొత్తం 72 ప్రైవేటు బస్సులపై కేసుల నమోదు చేశామని డీటీసీ(జిల్లా రవాణాధికారి కమిషనర్) షేక్ కరీం తెలిపారు. ఏలూరు హైవేలోని కలపర్రు వద్ద తనిఖీలు జరగగా..రూ. 7.65 లక్షల జరిమానా విధించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపితే సీజ్ చేస్తామని డీటీసీ హెచ్చరించారు.