News March 21, 2025
సిరిసిల్ల: పది పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి.!

నేటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో పదోతరగతిలో 3051 బాలురు, బాలికలు మొత్తం 6768 మంది విద్యార్థులు రాయనున్నట్లు తెలిపారు. వీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
News December 2, 2025
విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News December 2, 2025
PCOS ఉంటే వీటికి దూరంగా ఉండాలి

PCOS ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. వంటల్లో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల PCOS, ఇన్సులిన్ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీంతో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.


