News April 3, 2025
సిరిసిల్ల: పది పరీక్షలు ప్రశాంతం

సిరిసిల్ల జిల్లాలో ఒకేషనల్ పదవ తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని సిరిసిల్ల డీఈవో జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం జిల్లాలో 979 మంది విద్యార్థులకూ 977 మంది విద్యార్థులు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం విద్యార్థుల హాజరు శాతం 99.80గా నమోదయిందని తెలిపారు.
Similar News
News April 17, 2025
వనపర్తి: ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’

వేతనాల పెండింగ్, ఉద్యోగ భద్రత లాంటి ప్రధాన సమస్యలపై నిరసనగా ఏప్రిల్ 17న వనపర్తిలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానంలో ప్రారంభమైన ర్యాలీ పాత కలెక్టర్ ఆఫీస్ వద్ద ముగిసింది. TUCI జిల్లా అధ్యక్షుడు పి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో 60 ప్రకారం జీతాలు, పెండింగ్ వేతనాల చెల్లింపు, ESI, PF, ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News April 17, 2025
పెద్దపల్లి: 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మిత్రులు మృతి

పెద్దపల్లి జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖలో 15రోజుల వ్యవధిలో ఇద్దరు సబ్ స్టేషన్ ఆపరేటర్లు మృతి చెందారు. ఈ నెల 3న సబ్ స్టేషన్ ఆపరేటర్ రాజ్ కుమార్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ అద్దె ఇంట్లో అనుమానాస్పదకంగా మృతిచెందాడు. జీడికే పీజీ సెంటర్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న సామల రవి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా వీరిద్దరు గతంలో ముంజంపల్లి సబ్ స్టేషన్‌లో 10 ఏళ్లు కలిసి పని చేశారు.
News April 17, 2025
వనపర్తి: ‘వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి’

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని ఆవాజ్ రాష్ట్ర నాయకుడు MD జబ్బార్ డిమాండ్ చేశారు. గురువారం ఆవాజ్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.