News February 1, 2025
సిరిసిల్ల: పరిశీలనకు స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

నీటి సరఫరా పరిశీలనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా జిల్లాలోని అన్ని గ్రామాలలో నీటి సరఫరాను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
15 రోజుల్లో రెవెన్యూ సదస్సు దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

పెండింగ్లో ఉన్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ సమర్పించాలని, సాదా బైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News October 24, 2025
KMR: వైన్స్ దరఖాస్తుల గడువు ముగింపు..1502 దరఖాస్తులు

వైన్స్ షాపుల లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. కామారెడ్డి జిల్లాలోని 49 షాపుల వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు గురువారం Way2Newsకు తెలిపారు. అయితే, గత ఏడాది వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గింది. గతేడాది 2204 దరఖాస్తులు వచ్చాయి.
News October 24, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ నటుడు లేనట్లేనా?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో <<18087082>>స్పిరిట్<<>> మూవీ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన సౌండ్ స్టోరీలో ప్రధాన పాత్రల్లో నటించే వారి వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారని గతంలో ప్రచారం జరిగినా దీనిపై మూవీ యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా అప్డేట్లోనూ ఆయన పేరు లేకపోవడంతో, ఎలాగైనా లీని ప్రాజెక్టులోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.