News January 30, 2025

సిరిసిల్ల: పార అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన సక్కు బాయి

image

వీర్నపల్లి మండలం జవహర్ లాల్ నాయక్ తండాకు చెందిన బి.సక్కు బాయి 7వ తెలంగాణ పార అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సక్కు బాయిని ఈ రోజు స్ధానికులు అభినందించారు. అమె హైదరాబాద్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున పార అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఈ నెల 27,28 తేదీలో రెండు విభాగంలో డిస్కస్ త్రో, షాట్ పుట్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచారు.

Similar News

News November 23, 2025

వనపర్తి: లక్ష్యానికి దూరంగా పన్నుల వసూళ్లు

image

గృహ, వ్యాపార సముదాయాల నుంచి వసూలు చేసే పన్నుల విషయంలో పురపాలక శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టణంలో పలువురు పన్నులు సవరించాలని పురపాలికకు దరఖాస్తు చేసుకున్నా.. పట్టించుకోవడం లేదు. 2021 నుంచి 2026 వరకు 18,500 గృహ, వ్యాపార సముదాయాల నుంచి రూ.12.53 కోట్ల పన్నులు వసూలు చేయాల్సింది ఉండగా.. కేవలం రూ.2.60 కోట్ల పన్నులు మాత్రమే వసూలు చేశారు.

News November 23, 2025

KNR: సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ

image

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లును DEC 10 లోపు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.

News November 23, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్‌మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్‌‌లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు