News April 8, 2024
సిరిసిల్ల: పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్

రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉచిత శిక్షణకై ఎస్సీ అభ్యర్థులకు ఈనెల 10న స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. 100 సీట్లకు గాను.. 45 సీట్లు భర్తీ కాగా మిగిలిన 55 సీట్లకు సిరిసిల్ల చంద్రంపేటలోని ఎస్సి స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించబడునన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.
Similar News
News December 8, 2025
KNR: స్విమ్మింగ్లో బ్రాంజ్ మెడల్తో మెరిసిన స్వరణ్

ఆదిలాబాద్ వేదికగా జరుగుతున్న సౌత్ జోన్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్విమ్మర్ కంకణాల స్వరణ్ సత్తా చాటాడు. గ్రూప్-1 కేటగిరీలో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్వరణ్ను క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్, స్విమ్మింగ్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణమూర్తితో పాటు కోచ్లు ఘనంగా అభినందించారు.
News December 8, 2025
KNR: ‘పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించారు. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News December 8, 2025
కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు. పోలింగ్ అధికారులను (పీవో) 1255 మందిని, ఇతర పోలింగ్ అధికారులను (ఓపివో) 1773 మందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.


