News January 28, 2025
సిరిసిల్ల: ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

సిరిసిల్ల జిల్లాలోని పలువురు వివిధ రకాల సమస్యల్ని కలెక్టర్ ముందు ఉంచారు. పెట్రోల్ బంకులో ఉపాధి కల్పించాలని ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన దివ్యాంగుడు యశ్వంత్ కోరాడు. పంట రుణమాఫీ కాలేదని నర్సింగాపూర్ రైతులు ఫిర్యాదు చేశారు. కోతుల బెడద తీర్చాలని పెద్దూరు గ్రామస్థులు కోరారు. దళితుల భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మండేపల్లి వాసులు ప్రజావాణిలో కోరారు.
Similar News
News February 13, 2025
మేడ్చల్: DEO, MEO మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు

మేడ్చల్ జిల్లాలో విద్యాధికారులు ఉన్నారా అని SFI మేడ్చల్ జిల్లా కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు. పట్టణంలోని క్రిక్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని ఫీజు కట్టలేదని ఇంటికి పంపని ఘటన మరువకముందే, శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజుల వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన మేడ్చల్ డీఈఓ, ఎంఈఓ మిస్సింగ్ అయ్యారని SFI నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 13, 2025
HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.
News February 13, 2025
పోలీసుల నోటీసులపై పోచంపల్లి రియాక్షన్

TG: <<15447380>>పోలీసుల నోటీసులపై<<>> MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌజ్ తనదేనని, రమేశ్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఫామ్ హౌస్ వెళ్లి ఎనిమిదేళ్లు దాటినట్లు చెప్పారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు. కాగా కోడి పందేలు జరిగాయని గేమింగ్, యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.